కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆరో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన.. అనుకున్న స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ సాగడం లేదని అభిప్రాయపడ్డారు. కొవిడ్ టీకాపై మరింత అవగాహన కల్పించాలని సీసీఎంబీ డైరెక్టర్ సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకా అవసరమని పునరుద్ఘాటించారు. రెండో డోస్ తీసుకున్న 14 రోజులకు యాంటీబాడీలు ఉత్పత్తి ప్రారంభం అవుతాయన్న రాకేశ్ మిశ్రా.. 20-30 శాతం మందిలో తొలిడోస్ తీసుకున్నప్పటి నుంచే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. అన్ని టీకాలు సురక్షితమైనవని పేర్కొన్న ఆయన.. అన్ని వ్యాక్సిన్లు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని వివరించారు.
ఇదీ చూడండి: