ETV Bharat / city

క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం

author img

By

Published : Dec 19, 2020, 11:00 PM IST

ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘటన చోటు చేసుకుంది.

క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం
క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పటిదాకా వేగంతో దూసుకెళ్తున్న కారు ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో ఈ ప్రమాదం జరిగింది.

గుంటూరు జిల్లా రేపల్లె నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా కారు అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు ముందుభాగం పూర్తిగా కాలి బూడిదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: సాయం చేద్దామనుకున్నారు.. సజీవదహనమయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.