ETV Bharat / city

పట్టుబట్టి సాధించిన మహిళలు...డిమాండ్లకు తలొగ్గిన పోలీసులు - ఉద్ధండరాయుని పాలెంలో మహిళల ధర్నా

తమపై రాళ్లదాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ రాజధాని మహిళలు సోమవారం మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించారు. ఉద్దండరాయునిపాలెంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘటనకు నిరసనగా సాయంత్రం 6 గంటల నుంచి తుళ్లూరులో దీక్షా శిబిరం ఎదురుగా రోడ్డుపై వారు బైఠాయించారు. న్యాయం చేసే దాకా కదిలేది లేదని భీష్మించారు.

తుళ్లూరులో ధర్నా చేస్తున్న మహిళలు, రైతులు

author img

By

Published : Dec 8, 2020, 6:49 AM IST

తమపై రాళ్లదాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ రాజధాని మహిళలు సోమవారం మధ్యాహ్నం దాకా ఆందోళన కొనసాగించారు. ఉద్దండరాయునిపాలెంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘటనకు నిరసనగా సాయంత్రం 6 గంటల నుంచి తుళ్లూరులో దీక్షా శిబిరం ఎదురుగా రోడ్డుపై వారు బైఠాయించారు. న్యాయం చేసే దాకా కదిలేది లేదని భీష్మించారు. రాత్రి రోడ్డుపైనే నిద్రించారు. తెల్లవారాక ఆందోళన కొనసాగించారు. ఆందోళన విరమించి శిబిరంలోకి వెళ్లాలంటూ పోలీసులు నచ్చజెప్పినా, కేసులు పెడతామని బెదిరించినా పట్టువీడలేదు. డీజీపీ గౌతం సవాంగ్‌ వచ్చి హామీ ఇస్తేనే విరమిస్తామని తేల్చి చెప్పారు. వీరికి మద్దతుగా రాజధాని గ్రామాల నుంచి తుళ్లూరు వస్తున్న రైతుల్ని పెదపరిమి, వెలగపూడి, తదితర చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాల్ని మోహరించడంతో ఉత్కంఠ నెలకొంది.

పోలీసుల తీరుపై ఆగ్రహం
రోడ్డుపై బైఠాయించిన మహిళలు, రైతుల్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూడు రాజధానుల పేరుతో పెయిడ్‌ ఆర్టిస్టులతో నడుపుతున్న శిబిరాల్ని ఎత్తివేస్తేనే తాము ఆందోళన విరమిస్తామన్నారు. తాము కడుపు మండి రోడ్డు ఎక్కామని, దొంగ దీక్షలు చేసే వారికి మీరు కాపలా కాస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

స్పృహ తప్పిన మహిళా రైతు
మహిళలు, రైతులు ఎండలోనూ ఆందోళన కొనసాగించారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకున్న ఉద్దండరాయునిపాలెం మహిళ తనూజ నిరసన తెలుపుతూ ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న ఆమె తిరిగి ఆందోళనలో పాల్గొని రాళ్ల దాడి గురించి నాయకులకు వివరించారు. ‘ఆదివారం ఉద్దôడరాయునిపాలెంలో ఇంటింటికీ తిరుగుతూ 365వ రోజు దీక్షల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేం ఎంపీ నందిగం సురేశ్‌ ఇంటిపై దాడికి వెళ్లలేదు. అక్కడి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తే అసలు విషయం బయపడుతుంది. మా వల్ల తప్పు జరిగిందని తేలితే.. ఎంపీ కాళ్లు పట్టుకుంటాం. వారిది తప్పదని తేలితే ఆయన మా కాళ్లు పట్టుకుంటారా’ అని అన్నారు.

డీఎస్పీతో ప్రత్తిపాటి, శ్రావణ్‌కుమార్‌ చర్చలు

రాళ్లదాడి ఘటన, రైతుల ఆందోళనపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌.. తుళ్లూరు డీఎస్పీ జె.శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు. మహిళలు ఫిర్యాదు చేస్తే, కేసు పెడతామని, నిందితుల్ని అరెస్టు చేస్తామని, ఉద్దండరాయునిపాలెంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసులు సానుకూలంగా స్పందించడంతో మహిళలు, రైతులు ఆందోళన విరమించి, శిబిరంలోకి వెళ్లారు. మరోవైపు మిగిలిన రాజధాని గ్రామాల్లోని రైతులు అమరావతికి అనుకూలంగా 356వ రోజూ నిరసనల్ని కొనసాగించారు.

ఇదీ చదవండి

మూలాలు తేలని వింత వ్యాధి... జాతీయ సంస్థల పరీక్షలపైనే ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.