అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ 95 రోజులుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 29 గ్రామాల్లోని ప్రతి ఇంటి వద్ద రాత్రి 7.30 గంటల నుంచి 7.35 వరకు లైట్లు ఆపి... దీపాలు వెలిగించి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఈ నిరసన కొనసాగిస్తామని రైతులు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి దగ్గర లైట్లు ఆపి రాజధాని రైతులకు సంఘీభావం తెలియజేయాలని అమరావతి పరిరక్షణ సమితి నేతలు కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: