రాజధాని తరలింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రాజధాని రైతులు, ఐకాస సభ్యులు వివరించారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసు దాడుల గురించి చెబుతూ.. ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయింపును వెంకయ్య దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని కోరారు. రాజధాని తరలింపు జరగకుండా చూడాలని ఉపరాష్ట్రపతిని రైతులు కోరారు.
'రాష్ట్రానికి ఒక్కటే రాజధానిగా ఉండాలి'
రాజధాని విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన అనంతరం రాజధాని రైతులు మీడియాతో మాట్లాడారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దిల్లీ పెద్దలను కలిసి విన్నవిస్తున్నట్టు తెలిపారు. ఉపరాష్ట్రపతికి రాజధాని అంశంపై ప్రభుత్వ తీరును వివరించామని రాజధాని రైతులు తెలిపారు. రాజధాని మార్పుతో ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కూడా సమయం కోరినట్లు తెలిపారు. కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా భాజపా పెద్దలు, ప్రతిపక్షాల నాయకులను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరిని కలిసేందుకు ప్రయత్నిస్తామని.. అమరావతి రైతులు, ఐకాస నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: హస్తినకు రైతులు.. 'కేంద్రం ఎదుట గోడు చెబుతాం'