రాజధాని గ్రామాలు తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి ధర్నా శిబిరాల్లో 254వ రోజూ రైతులు, మహిళలు దీక్షలు కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతులు, మహిళలు.... అమరావతినే ఏకైక పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతవరంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొండపైకి చేరుకున్న భక్తులు స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ స్వామిని వేడుకున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
మాజీమంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు కూడా రైతులకు సంఘీభావం తెలిపారు. న్యాయం, ధర్మం కోసం పోరాడుతున్నామని.... న్యాయస్థానాలే తమకు దేవస్థానాలంటూ రైతులు, మహిళలు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల వరుస తీర్పుల తర్వాతైనా పాలకుల మనసు మారాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఏటీఎంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్ల