ETV Bharat / city

నేడు మంత్రుల రాజీనామా.. 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం - Cm jagan taza

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ
గవర్నర్​తో సీఎం జగన్ భేటీ
author img

By

Published : Apr 6, 2022, 6:20 PM IST

Updated : Apr 7, 2022, 10:28 AM IST

18:15 April 06

నేడు.. ఏపీ మొదటి కేబినెట్ చివరి సమావేశం

కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్​తో సీఎం చర్చ.. నేడు మంత్రుల రాజీనామా !

AP New cabinet: వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్​.. చివరి సమావేశం ఇవాళ జరుగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. ప్రమాణ స్వీకారం రోజే మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఈ మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసిన సీఎం... గవర్నర్‌ను కలిసి సమగ్రంగా చర్చించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.

వైకాపా ప్రభుత్వానికి సంబంధించిన రెండో కేబినెట్ త్వరలోనే కొలువు దీరనుండటంతో మొదటి కేబినెట్ చిట్టచివరి మంత్రివర్గ సమావేశం ఇవాళ జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. మంత్రిమండలిలోని మొత్తం 25 మంది మంత్రుల నుంచి సీఎం జగన్‌ రాజీనామాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. మంత్రిమండలి సమావేశ ఎజెండాను సిద్ధం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత ప్రక్రియను ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదా నలుగురు 11న మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. కుల సమీకరణాల రీత్యా ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులు కొత్త కేబినెట్ లోనూ కొనసాగే అవకాశాలున్నట్టు సమాచారం. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

చిట్టచివరి కేబినెట్ సమావేశంలో రాజీనామాల అంశంతో పాటు ముఖ్యమంత్రితో కలసి పనిచేసిన అనుభవాలను, నవరత్నాల అమలు తీరుపైనా మంత్రులు మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించే అంశంతో పాటు మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులపైనా చర్చించే అవకాశముంది. నెల్లూరులో పెన్నా నదిపై నిర్మించిన సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదాన్ని తెలియచేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలనూ ర్యాటిపై చేయనున్నారు. ఇక మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ లో మార్పు చేర్పులకు సంబంధించి ఇప్పటికే దిల్లీ పెద్దలకు , గవర్నర్​కు.. సీఎం జగన్ సమాచారం ఇచ్చివచ్చారు.

ఇదీ చదవండి: ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన

Last Updated : Apr 7, 2022, 10:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.