తెలంగాణ మంత్రివర్గం ఆగస్టు 1న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. దళితబంధు పథకానికి సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశం, హుజూరాబాద్ దళిత ప్రతినిధుల సమావేశం సారాంశాల ఆధారంగా పథకానికి సంబంధించి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దళితబీమా, చేనేత బీమా పథకాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
యాభై వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించవచ్చని సమాచారం. వర్షాలు, వరద నిర్వహణా బృందం ఏర్పాటు, పంటలకు సాగునీరు, ప్రాజెక్టులు సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. కొవిడ్ మూడో వేవ్ సన్నద్ధతపై కూడా కేబినెట్లో సమీక్షించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Lokesh: వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి: నారా లోకేశ్