పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలకు 43,141 ఎకరాల భూమి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్ల స్థలాలకు వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వనున్నారు. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. పేదల ఇళ్ల స్థలాలకు 26,970 ఎకరాల ప్రభుత్వ భూమి, 13 వేల ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేశామని తెలిపారు. యుద్ధప్రాతిపదికన స్థలాలు అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి : టీ తాగుతూ మంత్రి పేర్ని నాని ఏం చేశారంటే?