ETV Bharat / city

రాష్ట్రంలో విలాసవంతమైన హోటళ్లు, రిసార్టుల నిర్మాణాలు

రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో రూ.2,800 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్టుల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండనున్నాయి.

cabinet-approves-10-tourism-projects-in-the-state
రాష్ట్రంలో విలాసవంతమైన హోటళ్లు, రిసార్టుల నిర్మాణాలు
author img

By

Published : Oct 29, 2021, 8:13 AM IST

రాష్ట్ర పర్యాటక రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. ఒబెరాయ్‌, హయత్‌, ఇస్కాన్‌ ఛారిటీస్‌ సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో రూ.2,800 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇందులో ఉన్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2, 2.30 గంటల వరకు నిర్వహిస్తారు. గురువారం మాత్రం గంట ముందుగానే భేటీ ముగిసింది.

ఒబెరాయ్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న రిసార్టులు

  • విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరంలో రూ.350 కోట్లతో 40 ఎకరాల్లో 300 విల్లాలతో
  • తిరుపతిలోని పేరూరులో రూ.250 కోట్లతో 20 ఎకరాల్లో 100 విల్లాలతో
  • కడప జిల్లా గండికోటలో రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో 120 విల్లాలతో
  • చిత్తూరు జిల్లా హార్స్‌లీహిల్స్‌లో రూ.250 కోట్లతో 21 ఎకరాల్లో 120 విల్లాలతో
  • తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకల్లంకలో రూ.250 కోట్లతో 30 ఎకరాల్లో 150 విల్లాలతో

హయత్‌ సంస్థ ఆధ్వర్యంలో

  • విశాఖలోని శిల్పారామంలో 200 గదులు, 1500 సీట్ల సామర్థ్యంతో 3 ఎకరాల్లో రూ.200 కోట్లతో 5 స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌
  • తిరుపతి శిల్పారామంలో 225 గదులు, 1500 సీట్ల సామర్థ్యంతో 2.66 ఎకరాల్లో రూ.204 కోట్లతో 5 స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌
  • విజయవాడలో రూ.92 కోట్ల వ్యయంతో 81 గదులతో 4 స్టార్‌ హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌

తాజ్‌ బ్రాండ్‌తో

  • విశాఖలో తాజ్‌ బ్రాండ్‌తో మొత్తం రూ.722 కోట్ల వ్యయంతో 260 గదులతో 5 స్టార్‌ హోటల్‌, 90 సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, 12,750 చ.అడుగుల విస్తీర్ణంతో కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇందులో 2500 సీట్ల సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ ఉండనుంది.

పెనుకొండలో ఆధ్మాత్మిక కేంద్రం

ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో 75 ఎకరాల్లో అనంతపురం జిల్లా పెనుకొండలోని జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆధ్యాత్మిక కేంద్రాన్ని, టూరిస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 288 గదులతో యాత్రీ నివాస్‌ (అతిథిగృహాలు), 108 బెడ్లతో డార్మిటరీ, కృష్ణ లీలా థీమ్‌పార్కు, 2 వేల సీట్లతో యాంఫీ థియేటర్‌, 1000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం, ఆయుర్వేదిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, ఐకానిక్‌ టవర్‌, తదితర వాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు 48 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.