ETV Bharat / city

నానాటికీ పెరుగుతున్న ధరల భారం.. భారంగా రోజువారీ జీవనం

author img

By

Published : May 3, 2022, 4:47 AM IST

Updated : May 3, 2022, 5:47 AM IST

Expensive Hike: ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్‌.. ఇలా అన్నింటి ధరలు తగ్గేదే లే అన్న రీతిలో దూసుకెళ్తున్నాయి. మూడేళ్లలో నెలసరి ఇంటి ఖర్చులు ఏకంగా 5 వేలు దాటేశాయి. ఈ ధరాఘాతంతో బతకలేక సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

నానాటికీ పెరుగుతున్న ధరల భారం
Commodities rates hike
నానాటికీ పెరుగుతున్న ధరల భారం.. భారంగా రోజువారీ జీవనం

ఉప్పు, పప్పు, వంట నూనె, కరెంటు బిల్లులు, పెట్రోల్ బాదుడు... అబ్బో తలచుకుంటేనే మధ్య తరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే ఇంటి ఖర్చు సగటున నెలకు 5 వేల 200 రూపాయలకు పైగా పెరిగింది. అద్దె జీవులైతే.. ఏటా 5 నుంచి 10 శాతం పెంపుతో అదనపు భారం తప్పదు. వంట నూనెల మంటలు అంతా ఇంతా కాదు. లీటరు 60 రూపాయల లోపు ఉండే పామోలిన్ ధర గతేదాడి 120కి చేరగా.. ఇప్పుడు ఏకంగా 165రూపాయలు దాటేస్తోంది. పొద్దుతిరుగుడు నూనెదీ అదే దారి. ఏడాది కిందట పచారీ దుకాణానికి ఇచ్చే సొమ్ముతో పోలిస్తే వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకు పెరుగుదల కన్పిస్తోంది. కరోనా ప్రభావంతో పట్ణణాల్లో, పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.

కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. ఈ ఏడాది కంది, సెనగల దిగుబడి తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడొచ్చు. సగటున చూస్తే నెలకు కిలో చొప్పున కుటుంబంపై నెలకు 65 రూపాయల చొప్పున భారం పెరిగింది. 5 కిలోల గోధుమపిండి ప్యాకెట్ ధర 2019లో 205 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 270 చొప్పున అమ్ముతున్నారు.
మరో పక్క ఫోన్‌ బిల్లు మనకు తెలియకుండానే పెరిగిపోతోంది. గతంలో 3 నెలలకు 333 రూపాయలు ఉండే రీఛార్జ్‌ ఇప్పుడు 666కు చేరింది. దీనికి తోడు వై-ఫై రూపంలో నెలకు 500 రూపాయల వరకు అదనపు భారం తప్పట్లేదు. కేబుల్‌ టీవీ ఖర్చు 250రూపాయలు వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్‌కు సగటున 500 చొప్పున నాలుగు తీసుకున్నా.. 2వేల రూపాయలు అంటే నెలకు 166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్, కేబుల్ బిల్లుల రూపంలోనే నెలకు 600 రూపాయల వరకు అవుతోంది. వై-ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున తప్పట్లేదు.

2019 మధ్యలో వంటగ్యాస్ సిలిండర్ ధర 600 రూపాయల వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర 972 రూపాయలు అయింది. అంటే మూడేళ్లలో 62 శాతం పెరిగింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. 15 రూపాయల చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై 372 రూపాయల చొప్పున భారం పడుతోంది. పేద, మధ్య తరగతిపై కరెంటు బిల్లుల భారమూ అధికమైంది. గతంలో సగటున 500 రూపాయలు చొప్పున బిల్లు వచ్చే కుటుంబానికి ఇప్పుడు 650 వరకు చేరింది. అంటే సగటున 30 శాతం వరకు పెరిగాయి. వీటి రూపంలో ఒక్కో కుటుంబానికి 150 రూపాయల చొప్పున అదనపు ఖర్చు తప్పడం లేదు. ఏడాదికి 18 వందల రూపాయల వరకు ప్రభుత్వం బాదేస్తోంది.

ఇక పెట్రోల్‌, డీజిల్ ధరల గురించైతే చెప్పనక్కర్లేదు. చిరువ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులకు ద్విచక్రవాహనం భారమైపోయింది. నెలకు సగటున 25 లీటర్ల పెట్రోల్‌ లెక్కన చూసినా 11 వందల రూపాయల వరకు ఖర్చు పెరిగింది. 2019లో 75 రూపాయలలోపు ఉన్న పెట్రోల్‌ ధర.. ప్రస్తుతం 121 వరకు చేరింది. లీటరుకు 45 రూపాయలకు పైగానే పెరిగింది. ఇంజిన్‌ ఆయిల్ ధర 300 నుంచి 500కు చేరింది. సగటున రెండు నెలలకోసారి ఇంజిన్ ఆయిల్‌ మార్చినా.. నెల ఖర్చు 100 రూపాయల చొప్పున పెరిగినట్లే. మొత్తంగా చూస్తే బండి భారం నెలకు 12 వందల రూపాయలకు పైనే పెరిగింది. ఏడాది కిందట నుంచి మండుతున్న వంటనూనెలు.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మరింత ఎగిశాయి. పామోలిన్‌ను పెద్దమొత్తంలో సరఫరా చేసే ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం విధించడంతో రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. సగటున నెలకు 3 లీటర్ల వంటనూనె వినియోగించే కుటుంబానికి మూడేళ్ల క్రితం 270 మాత్రమే ఖర్చవగా.. ఇప్పుడు 541 రూపాయల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే సగటున వంద శాతం పెరిగింది.

బ్రాండెడ్‌ టీపొడి ధర గతంలో కిలో 540 ఉండేది. ప్రస్తుతం 780చొప్పున విక్రయిస్తున్నారు. అల్లం, యాలకులు, తులసి, అశ్వగంధ వంటి ఉత్పత్తులతో తయారయ్యే ఒక సంస్థ టీపొడి.. 2019లో 380 రూపాయలు ఉండేది. ప్రస్తుతం 560కి చేరింది. లీటర్ పాల ధర గతంలో 55 నుంచి 58 మధ్య ఉండేది. ఇప్పుడు సగటున 64 నుంచి 68 రూపాయల వరకు ఉంది. నెలకు 30 లీటర్లకు 300 రూపాయలు అదనంగా ఖర్చవుతోంది. సబ్బులు, డిటర్జెంట్‌ ఉత్పత్తుల ధరలూ.. 30 శాతం వరకు పెరిగినట్లు అంచనా. ఫేస్‌క్రీమ్‌, షాంపూ ధరలూ రెట్టింపయ్యాయి. పాత్రలు కడిగే సబ్బు ధర మూడేళ్ల కిందట 45 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 51 శాతం పెరిగి.. 68కి చేరింది. టూత్‌పేస్ట్‌ ధర 2019లో 79 ఉంటే.. ఇప్పుడు 96 రూపాయలకు పైగానే ఉంది.

Last Updated : May 3, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.