స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా..అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. తెలుగుదేశం సహా ఇతరపక్షాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాల్ని జారీచేయకుండాపలు చోట్ల రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్‌లో బుద్దా పేర్కొన్నారు. కులధ్రువీకరణ పత్రాలు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు.. కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు...కులధ్రువీకరణ, బకాయిలేమి లేవని చెప్పే నో డ్యూస్ ధ్రువపత్రాలు ఇచ్చేలా ఆదేశించాలని వెంకన్న పిటిషన్‌లో కోరారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారుల అడ్డంకులపై హైకోర్టులో పిల్ - బుద్దా వెంకన్న హైకోర్టు తాజా న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా..అధికారులు అడ్డంకులు సృష్టించడంపై తెదేపా నేత బుద్దా వెంకన్న హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు విచారణ జరపనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా..అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. తెలుగుదేశం సహా ఇతరపక్షాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాల్ని జారీచేయకుండాపలు చోట్ల రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్‌లో బుద్దా పేర్కొన్నారు. కులధ్రువీకరణ పత్రాలు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు.. కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు...కులధ్రువీకరణ, బకాయిలేమి లేవని చెప్పే నో డ్యూస్ ధ్రువపత్రాలు ఇచ్చేలా ఆదేశించాలని వెంకన్న పిటిషన్‌లో కోరారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చూడండి-'పిన్నెల్లి.. జగన్పై ప్రమాణం చేసి నిజం చెప్పాలి'