ETV Bharat / city

'రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది'

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయానికి సంబంధించిన పలు ప్రకటనలు చేశారు...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్నదాతల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం..కర్షకులకు కొంతవరకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పద్దులో ప్రయత్నించింది. రైతు రుణాల కోసం 16.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది.

budget 2021-22
బడ్జెట్ 2021-22
author img

By

Published : Feb 2, 2021, 1:40 PM IST

బడ్జెట్ 2021-22

2021-2022 వార్షిక పద్దులో దేశానికి వెన్నుముక అయిన అన్నదాతల కోసం లక్షా 31వేల 531కోట్ల రూపాయలు కేటాయించారు...ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. రైతుల సంక్షేమానికి కేంద్ర సర్కార్ కట్టుబడి ఉందన్న నిర్మలా...ఈ ప్రభుత్వ పాలనలో కనీస మద్దతు ధరను పెట్టుబడి కంటే ఒకటిన్నర రెట్లు పెరిగినట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణాల కోసం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 16.5 లక్షల కోట్లు కేటాయించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో.. తమ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో గోధుమ రైతులకు చెల్లించిన మొత్తం 2019-20కి రెండింతలైందన్న నిర్మలా ... ధాన్యం చెల్లింపులు సైతం ఒకటిన్నర రెట్లు వరకు పెరిగాయన్నారు. తృణధాన్యాల విషయంలో రైతులకు చేసిన చెల్లింపులు పరిశీలిస్తే... యూపీఏ హయాం కంటే 40 రెట్లు పెరిగినట్లు వివరించారు. టమోటా, బంగాళదుంప, ఉల్లిపాయలతో పాటు ఎగుమతులు చేసే పంట ఉత్పత్తుల సంఖ్యను 22కు పెంచుతున్నట్లు తెలిపారు.

మండీలను ఈనామ్​తో అనుసంధానం చేస్తాం..

మద్దతు ధర కింద గోధుమ రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 75 వేల కోట్లు కేటాయించాం అని, కనీస మద్దతు ధరకు లక్షా 72 వేల కోట్లు కేటాయించామని ఆర్ధిక మంత్రి తెలిపారు. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వెయ్యి మండీలను ఈనామ్‌తో అనుసంధానం చేయనున్నట్టు వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ సహా దేశవ్యాప్తంగా 6 హార్బర్లను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. పశుపోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పద్దులో ప్రస్తావించారు.

సూక్ష్మ సేద్యం కోసం..

సూక్ష్మసేద్యం కోసం 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపిన నిర్మలాసీతారామన్.. స్వామిత్వ పథకాన్ని దేశం మొత్తం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పీఎమ్ కిసాన్ పథకానికి 65 వేల కోట్లు కేటాయించారు. అయితే... ఉపాధిహామీ పథకానికి గతేడాది లక్షా,11 వేల 500 కోట్లు మంజూరు చేయగా.. ఈసారి 73 వేల కోట్లకు పరిమితం చేశారు. నీటి సదుపాయాలకు 2.87 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇదీ చదవండి: రాజ్యసభను తాకిన రైతు ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.