ETV Bharat / city

సిట్​కు భయపడేవాళ్లు ఎవరూ లేరు:బుద్దా వెంకన్న

ప్రభుత్వం వేసిన సిట్​కు భయపడేవాళ్లు ఎవరూ లేరని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. ఈ 9 నెలల కాలంలో వైకాపా మంత్రులు చేసిన అవినీతిపై సిట్ వేయాలని సీఎం జగన్​కు సవాల్ చేశారు. బీసీలను అణచివేసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపించారు.

budda venkanna react on SIT on past government decisions

author img

By

Published : Feb 22, 2020, 12:54 PM IST

Updated : Feb 22, 2020, 3:18 PM IST

పోలీసు అధికారులతో ప్రభుత్వం సిట్‌ వేస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. తెదేపా పాలనలో అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్​ ప్రభుత్వం 26 విచారణ కమిటీలు వేసి ఏం తేల్చిందో... ఈ సిట్‌ దర్యాప్తులోనూ అదే తేలుతుందన్నారు. 9 నెలల పాలనలో మంత్రులు చేసిన అవినీతిపై సిట్‌ వేయాలని సీఎం జగన్‌కు బుద్దా సూచించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సోదరి సునీత ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం జగన్ విచారణ వేగవంతం చేయాలని అన్నారు.

మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

ప్రభుత్వ వైఫల్యాలపై అచ్చెన్నాయుడు గట్టిగా మాట్లాడుతున్నారనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిని వెలికితీస్తామంటూ వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఏం చేసిందని ప్రశ్నించారు. 2004కు ముందు.. ఆ తర్వాత జగన్​ ఆస్తులు ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

Last Updated : Feb 22, 2020, 3:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.