కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పాటైంది. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వాదనలపై ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది. 2019 ఆగస్టు తర్వాత తొలిసారి ట్రైబ్యునల్ సమావేశం నిర్వహించనుంది.
తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ దాఖలైన ఓ అఫిడవిట్ కు సంబంధించి వాదనలు జరగనున్నాయి. ఏపీ తరఫు న్యాయవాది ఈ విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుపై ట్రైబ్యునల్ తీర్పు చెప్పనునుంది.
ఇదీ చదవండి:
రాయలసీమ’ సందర్శన అవసరం లేదు.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ