రాష్ట్రంలోని పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. కార్మికులు, కూలీలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రైతుబజార్ల సంఖ్యను పెంచుతున్నామన్న మంత్రి బొత్స... సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నామని వివరించారు.
ఎవరికి అనుమానిత లక్షణాలున్నా వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్వారంటైన్లలో వసతులు పెంచాలని సీఎం ఆదేశించినట్టు బొత్స తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోనూ అత్యవసర ఏర్పాట్లు చేశామని చెప్పారు. అరటి, టమాటా, అరటి, బత్తాయి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు బొత్స సత్యనారాయణ వివరించారు.
ఇదీ చదవండీ... ఏపీలో విజృంభిస్తున్న కరోనా... 58కి చేరిన కేసులు