ETV Bharat / city

తెలంగాణలో బోనాల జాతర.. ముహూర్తం ఖరారు

తెలంగాణలో బోనాల జాతర వచ్చేసింది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ఆరంభం కానున్నాయి. జులై 17న మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి జరగనున్నాయి. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలను ఊరేగించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

తెలంగాణలో బోనాల జాతర
తెలంగాణలో బోనాల జాతర
author img

By

Published : Jun 6, 2022, 3:12 PM IST

హైదరాబాద్ మహానగరం ఆషాఢ బోనాలకు ముస్తాబవుతోంది. నగరమంతా సుమారు నెలరోజులపాటు ఆధ్మాత్మిక శోభను సంతరించుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూలై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పిస్తారు. మరుసటి రోజు జూలై 18న రంగం కార్యక్రమంలో భవిష్యవాణి ఉంటుంది.

జూలై 24వ తేదీన భాగ్యనగర బోనాలు, అదే నెల 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు నిర్వహిస్తారు. జూలై 28వ తేదీన గోల్గొండ బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల పండుగను గొప్పగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని తెలిపారు. నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా 3వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. కల్చరల్‌, లైటింగ్, ఎల్సీడీ స్క్రీన్‌తో బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

  • జూన్​ 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు
  • జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
  • జులై 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం
  • జులై 24న భాగ్యనగర బోనాలు
  • జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు
  • జులై 28న గోల్కొండ బోనాలతో ముగియనున్న ఉత్సవాలు

ఇవీ చదవండి:

అనసూయ.. నీటి అలల మధ్య భర్తతో అలా.. ఫొటోస్ వైరల్​

పవర్​ స్టార్​ కోసం అభిమాని సాహసం.. ఏకంగా 400 కి.మీ నడుచుకుంటూ...

SSC Results: పదో తరగతి ఫలితాలు విడుదల.. తగ్గేదేలే అన్న బాలికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.