హైదరాబాద్ టోలీచౌకి విరాసత్‌నగర్‌లో సహాయక చర్యల్లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. వరదలో చిక్కుకున్న బాధితుల్ని తరలించే బోటు ఉన్నట్టుండి తిరగబడింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో కూర్చోబెట్టి బయలుదేరుతున్న సమయంలో బరువు ఎక్కువై.. బోటు తిరగబడింది.
ఊహించని పరిణామంతో.. అంతా ఉలిక్కిపడ్డారు. చివరకు సహాయక సిబ్బంది బాధితుల్ని రక్షించి.. సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
ఇదీచదవండి.