ETV Bharat / city

తెలంగాణ: కుత్బుల్లాపూర్​లో భారీ పేలుడు... భయంతో జనం పరుగులు - hyderabad news

తెలంగాణలోని కుత్బుల్లాపూర్​ పరిధిలోని జైరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

blast in kuthbulblast in kuthbullapurlapur
blast in kuthbullapur
author img

By

Published : May 12, 2021, 7:53 AM IST

తెలంగాణ: కుత్బుల్లాపూర్​లో భారీ పేలుడు... భయంతో జనం పరుగులు

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జైరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు.

అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:నాలుగున్నర గంటల ఆలస్యం...గాల్లో కలిసిన 11 ప్రాణాలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.