ETV Bharat / city

ఈ 'కూలింగ్ సాల్ట్' గురించి విన్నారా? - ap latest news

సమ్మర్ అంటేనే విపరీతమైన వేడి. ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలతో పాటు శరీర ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుంటాయి. తద్వారా శరీరంలోని నీటిశాతం చెమట రూపంలో ఆవిరైపోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్లో శరీరానికి చలువ చేసే పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చలువ చేసే పదార్థాలంటే కేవలం నీటి శాతం ఎక్కువగా ఉండేవి మాత్రమే కాదు.. నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్)ను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

బ్లాక్ సాల్ట్​తో ఆరోగ్యం
బ్లాక్ సాల్ట్​తో ఆరోగ్యం
author img

By

Published : Mar 15, 2021, 8:06 PM IST

మన వంటల్లో అతి తక్కువగా వాడే నల్ల ఉప్పు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే ఆయుర్వేద మందుల తయారీలో, వివిధ రకాల థెరపీల్లో కూడా దీన్ని ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నారు. మరి, ఇంతకీ ఈ నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి...

చలువనిస్తుంది..

coolsalt650-3.jpg
చలువనిస్తుంది..

* మొదట నలుపు రంగులో, పొడి చేయగానే లేత పింక్ కలర్‌లో కనిపించే ఈ ఉప్పులో ఐరన్‌తో పాటు, ఇతర ఖనిజాలు, ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. ఎండాకాలంలో శరీరానికి చలువ అందించే ఈ ఉప్పును లెమనేడ్, ఆమ్ పన్నా.. వంటి కొన్ని రకాల సమ్మర్ డ్రింక్స్‌లోనూ భాగం చేసుకుంటుంటారు. అందుకే ఈ ఉప్పును 'కూలింగ్ సాల్ట్'గానూ పిలుస్తారు.

* వివిధ రకాల అనారోగ్యాలను నయం చేసే గుణాలు కూడా ఈ ఉప్పులో అనేకం. అందుకే దీన్ని ఆయుర్వేదిక్ మందుల తయారీలో, వివిధ థెరపీల్లో చికిత్స కోసం వాడుతుంటారు.

coolsalt650-4.jpg
బ్లాక్ సాల్ట్​తో అనారోగ్యం మాయం

  • వేసవిలో ఉబ్బసం, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు.. వంటివి కామన్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందాలంటే బ్లాక్ సాల్ట్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం, మనం తాగే పానీయాల్లో కలుపుకోవడం.. వంటివి చేయాలి. ఫలితంగా సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  • నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యంగా అనిపించడంతో పాటు గుండెల్లో మంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నల్ల ఉప్పును రోజూ తీసుకోవడం మేలు.
  • మనం రోజూ వేసుకునే ఉప్పుతో పోల్చితే నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. తద్వారా శరీరంలో నీరు నిలిచిపోకుండా (వాటర్ రిటెన్షన్ తలెత్తకుండా) కాపాడుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశముండదు.
  • ఈ ఉప్పులోని పొటాషియం కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల్ని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి తరచూ కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • శరీరం ఎముకల్లోని సోడియంను ఎక్కువగా శోషించుకోవడం వల్ల క్రమంగా ఆస్టియోపొరోసిస్ బారిన పడే అవకాశముంటుంది. మరి, దాన్నుంచి బయటపడాలంటే రోజూ మనం తాగే నీటిలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని తీసుకోవడం ఉత్తమం.
  • మనల్ని ఒత్తిళ్లకు దూరంగా ఉంచేందుకు మన శరీరంలోని మెలటోనిన్, సెరటోనిన్ అనే హార్మోన్లు దోహదపడతాయి. అయితే వాటిని సంరక్షించే గుణాలు నల్ల ఉప్పులో బోలెడున్నాయి. అందుకే దీన్ని రోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు.
  • నల్ల ఉప్పు రక్తంలోని చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది.

అందానికీ..

coolsalt650-5.jpg
అందానికీ..
  • ఈ కాలంలో ఎండ వేడికి చర్మం కందిపోయి కళ తప్పుతుంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలన్నా నల్ల ఉప్పును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.
  • రోజూ స్నానం చేయడంలో భాగంగా రసాయనాలు అధికంగా ఉండే సబ్బుల కంటే బ్లాక్ సాల్ట్‌ను ఉపయోగిస్తే చక్కటి ప్రయోజనాల్ని పొందచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఉప్పు స్కిన్ అలర్జీలను తొలగించడంతో పాటు పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. లేదంటే ఈ ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకున్నా ఫలితం ఉంటుంది. తద్వారా చర్మం పునరుత్తేజితమవుతుంది.
  • కొద్దిగా నల్ల ఉప్పును మనం ఉపయోగించే క్లెన్సర్లు, స్క్రబ్స్‌లో భాగం చేసుకొని వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మంపై ఉండే జిడ్డును పోగొట్టడంతో పాటు మొటిమల సమస్యనూ దూరం చేస్తుంది.
  • నల్ల ఉప్పు జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించడానికి దోహదం చేస్తుంది. బలహీనంగా మారిన కుదుళ్లను బలంగా మార్చుతుంది.

నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారుగా! మరింకెందుకాలస్యం.. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకొని ఈ వేసవిని కూల్‌గా ఎంజాయ్ చేసేయండి..!

ఇదీ చూడండి : మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. పరిశీలనలో పలువురి పేర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.