ETV Bharat / city

రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

black fungus cases in AP
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు
author img

By

Published : May 31, 2021, 7:17 PM IST

Updated : May 31, 2021, 7:35 PM IST

18:56 May 31

black fungus cases in AP

cm jagan review
సీఎం సమీక్ష

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.  కొవిడ్ నియంత్రణ, కర్ఫ్యూ,  బ్లాక్ ఫంగస్​ కేసులపై ఇవాళ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. కొవిడ్ రాకుండానే 40 మందికి బ్లాక్ ఫంగస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 1179 కేసులు నమోదు కాగా.. 1068 మందికి చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు. 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోగా.. 14 మంది మృతి చెందారని వివరించారు. మధుమేహం రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.  

తగ్గిన పాజిటివిటీ రేటు..

పట్టణ ప్రాంతాల్లో ఒక మిలియన్ జనాభాకు 2632 కొవిడ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు సీఎం జగన్​కు తెలిపారు. ఈ సంఖ్య పల్లె ప్రాంతాల్లో 1859గా ఉంది. మే 16 నాటికి కొవిడ్ పాజిటివిటీ రేటు 25. 56 శాతంగా ఉంటే.. మే 30 నాటికి 15.9 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. 2 లక్షల నుంచి 1.6 లక్షలకు కేసుల సంఖ్య తగ్గిందని.. రికవరీ రేటు 90 శాతానికి పెరిగిందని వెల్లడించారు. కొవిడ్​తో తల్లిదండ్రులను కోల్పోయి ఆనాథలైన పిల్లలు 92 మంది ఉన్నారని.. వీరిలో 43 మంది పిల్లలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు.  

ఇదీ చదవండి

Anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ..!

Last Updated : May 31, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.