ETV Bharat / city

నేడు తెలంగాణలో పర్యటించనున్న తరుణ్‌చుగ్‌ - sirpur kagaj nagar

భాజపా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ తరుణ్‌చుగ్‌ సోమవారం రాత్రి హైదరాబాద్​కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటించనున్నారు.

TARUNCHUG
TARUNCHUG
author img

By

Published : Feb 23, 2021, 9:16 AM IST

భాజపా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ తరుణ్‌ చుగ్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాకు వెళ్లనున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాల్వాయి హరీశ్, తరుణ్‌ చుగ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

రెండో రోజు తరుణ్ ​చుగ్ పార్టీ ముఖ్య నేతలతో​ సమావేశం కానున్నారు. వారితో.. పార్టీ బలోపేతం, చేరికలు, పట్టభద్రుల, కార్పొరేషన్ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడో రోజు పర్యటనలో నాగార్జున సాగర్​లో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ఉప ఎన్నికలో విజయంపై.. నేతలకు దిశానిర్థేశం చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఎస్​ఈసీకీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.