bjp republic day: భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎంపీ సుజనా చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించి.. మాట్లాడారు. జైలులో ఉన్న శ్రీకాంత్రెడ్డిని కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తే.. హోంమంత్రి సుచరిత వ్యతిరేకించడం అవివేకమని ఆయన విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డిని 307 సెక్షన్ కింద ఎలా అరెస్టు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వైకాపా అరాచకాంధ్రప్రదేశ్గా మార్చిందని ధ్వజమెత్తారు.
వైకాపా పాలన అంతా రివర్సే..
గుంటూరు భాజపా కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటును భాజపా స్వాగతిస్తోందన్నారు. భాజపా మేనిఫెస్టోలో కూడా 26 జిల్లాల అంశం ఉందని చెప్పారు. అయితే జిల్లాల ఏర్పాటు అంశంపై కొంత చర్చ జరగాల్సి ఉందన్నారు. జిల్లాల సరిహద్దుల విషయంలో కొన్నిచోట్ల ఇబ్బందులు వస్తాయని కన్నా అభిప్రాయపడ్డారు. పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులకు భాజపా మద్దతు ఉంటుందని చెప్పారు. మధ్యంతర భృతి కంటే పీఆర్సీ తగ్గించారని.. వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తరహాలోనే పీఆర్సీ రివర్స్ చేసిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: PAWAN KALYAN: జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు... జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కల్యాణ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!