ETV Bharat / city

BJP Protest in Telangana: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 14 రోజుల పాటు భాజపా నిరసనలు.. - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు

BJP Protest in Telangana:భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో... 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ శ్రేణులు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టును ఖండిస్తూ... కార్యకర్తలు ఇవాళ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. మరోవైపు నిర్బంధాలు, అరెస్టులతో ప్రజలతో సంబంధాన్ని తెంచలేదని... ప్రభుత్వంపై బండి సంజయ్‌ మండిపడ్డారు.

BJP Protest in Telangana
BJP Protest in Telangana
author img

By

Published : Jan 4, 2022, 10:00 AM IST

BJP Protest in Telangana: నిర్భందాలు, అరెస్టులు ప్రజల మధ్య సంబంధాన్ని తెంచలేవని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. అరాచక పాలనలో నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తే... సంకెళ్లు వేస్తారా అంటూ కేటీఆర్​ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. బండి సంజయ్‌ అరెస్టు నేపథ్యంలో 14 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. భాజపా కార్యాలయంలో భేటీ అయిన పార్టీ ముఖ్యనేతలు... ఇవాళ్టి నుంచి జిల్లా, మండలకేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని.... కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 14 రోజులపాటు రాష్ట్ర నాయకులతో పాటు .. రోజుకో జాతీయ నాయకుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. 317 జీవో సవరణ, నిరుద్యోగం వంటి, రైతు సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు.

కరీంనగర్‌ జైలులో ఉన్న బండి సంజయ్‌ను ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం బండి సంజయ్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు పోలీసులు వ్యవహరించిన తీరును తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులతోపాటు..... బండి సంజయ్‌ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ నిరసిస్తూ... భాజపా నాయకత్వం చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పాల్గొననున్నారు. రేపటి నుంచి 3 రోజులు జరిగే RSS సమావేశానికి హాజరయ్యేందుకు... నేడు జేపీ నడ్డా హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.... 6 గంటలకు సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌ వద్ద జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.