'కేంద్రం అన్నీ గమనిస్తోంది - తగిన సమయంలో స్పందిస్తుంది' - sujana choudary
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం గమనిస్తోందని అన్నారు భాజపా ఎంపీ సుజనా చౌదరి. ప్రజలను ఇబ్బంది పెట్టి పరిపాలన సాగుతున్న తీరు మంచికాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.
కేంద్రం అన్నీ గమనిస్తోంది- తగిన సమయంలో స్పందిస్తుంది
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశలనూ కేంద్రం గమనిస్తోందని ఆ పార్టీ ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. ఒక పార్టీ వ్యక్తిలా డీజీపీ మాట్లాడుతున్నారని... ఇలా కొనసాగితే ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రైతులపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు. గుడులకు వెళ్తున్న వారిని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పోలీసులకు కులాలతో పనేంటని అన్నారు. గ్రామాల్లో రైతుల ర్యాలీలకు అనుమతి ఇవ్వని పోలీసు యంత్రాంగం... వైకాపా ర్యాలీలకు ఎలా మద్దతు ఇస్తోందని నిలదీశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పరిపాలన చేయడం మంచిపద్దతి కాదన్నా సుజనా... అమరావతి రైతులకు 13 జిల్లాల ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు.
Conclusion:
TAGGED:
sujana choudary