తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించిన భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 30మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్, నాంపల్లి పోలిస్ స్టేషన్లకు తరలించారు. న్యాయవాదుల హత్యలను నిరసిస్తూ ఈ ఆందళనను చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడుతున్న వారికే రక్షణ లేదని కార్యకర్తలు ఆరోపించారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే ఘటన జరిగిందన్నారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: