ETV Bharat / city

'ఒప్పంద అధ్యాపకుల సమస్యలను పరిష్కరించండి'

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తోన్న ఒప్పంద అధ్యాపకుల తరఫున భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఐదు అంశాలను లేఖలో ప్రస్తావించారు.

విష్ణువర్ధన్ రెడ్డి
విష్ణువర్ధన్ రెడ్డి
author img

By

Published : Apr 28, 2021, 8:16 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తోన్న ఒప్పంద అధ్యాపకుల తరఫున భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్దనరెడ్డి.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఐదు అంశాలను ప్రధానంగా తన లేఖలో ప్రస్తావించారు. అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సహాయాన్ని సీఎం సహాయ నిధి నుంచి అందించాలని కోరారు.

  • వరకు ప్రభుత్వం అమలు చేయడం లేదు . ప్రభుత్వ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారికి కూడా వర్తింపచేయాలి .

    4. ప్రభుత్వం నియమించిన కమిటీ సాధ్యమైనంత తొందరగా నివేధిక అందజేసి ఆర్ధిక భద్రతతో కూడిన ఉద్యోగ భద్రతను కల్పించాలి.(7/7)

    — S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా వల్ల మరే ఇతర అనారోగ్యంతో విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులలో ఒకరికి కనీసం పొరుగు సేవల ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచినట్లుగానే.. డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన వారికి, ప్రభుత్వ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఆర్ధిక భద్రతతో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని.. గత ఏడాదిగా కమిషన్‌ స్థాయిలో పెండింగ్‌ ఉన్న చనిపోయిన దాదాపు 60 కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం వెంటనే అందించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. మే 7న విచారణ

పైథాన్​-5 మిసైల్​ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.