రామతీర్థంలో రాముడికి జరిగిన అవమానం దేశం మొత్తానికి జరిగిన అవమానమని భాజపా ఏపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ఎప్పటికీ క్షమించేది లేదన్నారు. శ్రీకాళహస్తిలో భాజపా ఓబీసీ మోర్చా సమ్మేళనంలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిపాలన నుంచి జగన్ తప్పుకోవాలన్నారు. తిరుమల ఆలయంపై శిలువ ఆకారాన్ని అలంకరించారని.. ఆ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాక.. అది తొలగించి కుంభం ఆకారం పెట్టారని గుర్తు చేశారు. ప్రశ్నించిన యువకుడిని జైల్లో పెట్టారని..అతడిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రజాప్రతినిధుల్లో హిందువులు లేరా..? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని... త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తిరుపతిలో భాజపా, జనసేన నుంచి ఎవరు నిలబడినా మోదీ నిలబడినట్లేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి