ETV Bharat / city

విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళ్తా: జితేందర్​రెడ్డి - మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి వీడియో

Jithender reddy: తెలంగాణలోని దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా తాను పనిచేశానని., అక్కడ భాజపా గెలుపును ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ఆక్షేపించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్​ చేశారు.

విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళ్తా
విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళ్తా
author img

By

Published : Mar 3, 2022, 10:05 PM IST

విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళ్తా

Jithender reddy: తెలంగాణలో భాజపా ఎదుగుదలను ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి ఆక్షేపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్​ను సైబరాబాద్ సీపీ చదవలేక చదివారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ కారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జితేందర్​రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌ నుంచి కార్యకర్తలు.. దిల్లీ వస్తే తన ఇంటికి వచ్చేవారని వారికి వసతి కల్పించడం బాధ్యతన్నారు.

మున్నూరు రవి తన వద్దకు వచ్చినప్పుడు ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని జితేందర్​రెడ్డి స్పష్టం చేశారు. మున్నూరు రవికి మాత్రమే తాను వసతి కల్పించానని.. ఆయనతో ఎవరు వచ్చారో తనకు తెలియదని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. మంత్రిపై కుట్ర ఎందుకు జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ కోసం పోలీసులు పిలిస్తే వెళతానని స్పష్టం చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్‌ ఫోన్ చేసి అండగా ఉంటామన్నారని చెప్పారు.

'మంత్రి హత్యకు కుట్ర కేసులో ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయవిచారణ జరిపించాలి. ఎలాంటి మచ్చ లేని నాపై విపరీత ఆరోపణలు చేస్తున్నారు. నా ఇంటిపై రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా.. అక్కడ భాజపా గెలుపు ఓర్వలేకే ఆరోపణలు.'

- జితేందర్​రెడ్డి, మాజీ ఎంపీ

ఇవీచూడండి: TS News: తెలంగాణలో మంత్రి హత్యకు సుపారీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.