కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి హల్చల్ చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి గర్భాలయంలోకి ప్రవేశించారు. ఆలయ సిబ్బంది వారించినా ఆగలేదు. ఈ క్రమంలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు నమోదు...
మహానంది పోలీస్‌స్టేషన్‌లో భాజపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి పై కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు అతిక్రమించారని ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
శ్రావణి ఆత్మహత్య: బయటపడ్డ ఫోన్ కాల్ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం