ETV Bharat / city

Adinarayana Reddy: 'వివేకా హత్య కేసులో అరెస్టుల సినిమా ఇంకా ఉంది' - వివేకా హత్యపై ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Adinarayana Reddy: వైకాపా ప్రభుత్వంపై భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. ఈ కేసులో తర్వలోనే కీలక అరెస్ట్​లు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

BJP leader Adinarayana Reddy
BJP leader Adinarayana Reddy
author img

By

Published : Dec 28, 2021, 5:15 PM IST

భాజపా నేత ఆదినారాయణరెడ్డి

Adinarayana Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని.. భాజపా నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. తానే హత్య చేయించానంటూ అప్పట్లో బురదజల్లిన వైకాపా నేతలు... ఇప్పుడు కథ అడ్డం తిరిగే సరికి దిక్కుతోచని స్థితిలో చిక్కారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలంటే భాజపా సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు.

"వివేకా హత్య ఘటనలో నా పేరు ప్రచారం చేశారు. వివేకా హత్య కేసులో అరెస్టుల సినిమా ఇంకా ఉంది. త్వరలోనే కీలక అరెస్ట్​లు జరిగే అవకాశం ఉంది. అమరావతిని అన్ని విధాలా నాశం చేశారు. వాళ్లకు భూములు ఎక్కడ ఉంటే.. అక్కడ రాజధాని ఉండాలనేది వాళ్ల ఆలోచన.పద్మనాభస్వామి ఆదాయం కంటే జగన్‌ ఆదాయమే ఎక్కువ" - ఆదినారాయణరెడ్డి, భాజపా నేత

ఇదీ చదవండి: YS Viveka murder case: శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు.. సీబీఐ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.