ETV Bharat / city

'సీఏఏపై ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు'

author img

By

Published : Jan 5, 2020, 1:06 PM IST

సీఏఏపై 'జన్​ జాగరణ్ అభియాన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దశాబ్దాల సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపిస్తున్నారని అన్నారు.

BJP ap president  kann comments on CAA
BJP ap president kann comments on CAA
సీఏఏపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే పౌరసత్వ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని తెలిపారు. దశాబ్దాల సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలూ పరిశీలించే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చారని చెప్పారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ముస్లింలను రెచ్చగొట్టి, హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టంపై 'జన్ జాగరణ్‌అభియాన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కరపత్రాన్ని పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతుల ఆవేదనపై పాట విడుదల

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.