Birds Walk Festival 2022 : తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బర్డ్స్వాక్ ఫెస్టివల్ రెండోరోజు ఉత్సాహంగా సాగుతోంది. పక్షుల కిలకిల రావాల నడుమ ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు.. పర్యావరణ ప్రేమికులు తెల్లవారుజామునే అడవిలోకి పయనమయ్యారు.
Birds Walk Festival 2022 in Kagaznagar : కాగజ్‌నగర్ మండలంలోని కడంబ, రేగుల గూడ, కోసిని, వాచ్ టవర్, సిర్పూర్ టిలో మాలిని, బెజ్జూరు మండలంలో మత్తడి స్ప్రింగ్ కట్ట, పెంచికలపేట మండలంలో కొండపల్లి అటవీ ప్రాంతాల్లోని పక్షులు పర్యాటకులను ఆకర్షించాయి. రెండు రోజులపాటు సాగే బర్డ్స్వాక్ ఫెస్టివల్ తమ జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందని పర్యాటకులు తెలిపారు.
అటవీశాఖ అధికారులు వారి వెంట ఉండి.. రకరకాల పక్షులను చూపించి మధురానుభూతిని కలిగించారు. బర్డ్ వాక్ ఫెస్టివల్ ముగింపు సందర్భంగా ఇవాళ కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో పర్యాటకులకు ధ్రువపత్రాలతో పాటు జ్ఞాపికలు అందించనున్నారు.
ఇదీ చూడండి: Bird Walk in Forest: ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో బర్డ్‌వాక్.. చూద్దాం రారండోయ్!