ETV Bharat / city

పవన్ స్టేట్ రౌడీ.. ఆయన అనుచరులే ఆకు రౌడీలు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

author img

By

Published : Feb 27, 2021, 5:38 PM IST

తాను ఆకు రౌడీనంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులే ఆకు రౌడీలని, పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ ఘాటుగా బదులిచ్చారు. అవగాహన లోపంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

bhimavaram mla grandhi srinivas
bhimavaram mla grandhi srinivas
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను ఆకు రౌడీని కాదని... పవన్ కల్యాణే స్టేడ్ రౌడీ.. ఆయన అనుచరులు ఆకు రౌడీలని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో జనసేన సైనికుల కామెంట్లు చూస్తే ఓ పార్టీ అధినేతగా పవన్ ఆత్మహత్యాయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు.

ఈ మధ్య పవన్ కల్యాణ్ నాపై కొన్ని విమర్శలు చేశారు. ఆకు రౌడీని అంటూ అవగాహన లోపంతో విమర్శించారు. అబద్ధాలను ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అర్బన్ బ్యాంక్ లో కుంభకోణమంటూ నాపై పవన్​ చేసిన ఆరోపణలపై గతంలోనే స్పష్టమైన వివరణ ఇచ్చాను. ఈ విషయంలో ఇప్పటి వరకూ నాపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ముందస్తు బెయిల్ వంటి వాటి కోసం కూడా ప్రయత్నం చేయలేదు. భీమవరం, గాజువాకలో ఓడిపోయారన్న బాధలో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేయటం దారుణం. జన సైనికులను సంఘ విద్రోహ శక్తులుగా మార్చటంలో పవన్ పాత్రే ఎక్కువగా ఉంది. నేను ఆకు రౌడీని కాదు...మీరే స్టేట్ రౌడీ.. జనసైనికులు ఆకు రౌడీలు. వీటిపై పెటెంట్ మీకే ఉంది. - గ్రంధి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే

అభిమానుల తీరుతో ప్రజలే కాక పవన్ సొంత కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఇబ్బందులకు గురైన సంఘటనలు మర్చిపోకూడదన్నారు. పవన్ కల్యాణ్ తలలు నరకుతామంటే.. తాము అందుకు సిద్ధంగా ఉన్నామని గ్రంధి శ్రీనివాస్​ అన్నారు.

ఇదీ చదవండి

రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.