ETV Bharat / city

Vaccine for Children: 2 నెలల్లో చిన్నారులకూ కొవాగ్జిన్‌ టీకా - 2 నెలల్లో చిన్నారులకూ కొవాగ్జిన్‌ టీకా

భారత్​ బయోటెక్​ సంస్థ చిన్నారుల కోసం శుభవార్త తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు అతిత్వరలోనే వ్యాక్సిన్​ తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఎండీ డాక్టర్​ కృష్ణ ఎల్ల తెలిపారు. వచ్చే రెండు నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు వెల్లడించారు.

cc
cc
author img

By

Published : Aug 19, 2021, 10:17 AM IST

కొవిడ్‌-19 వ్యాధి నుంచి రక్షణ కోసం చిన్న పిల్లలకు ఇచ్చే ‘కొవాగ్జిన్‌’ టీకా రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూశామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ‘ఇప్పటికే టీకా భద్రత ఖరారైంది. రోగ నిరోధకశక్తి (ఇమ్యునోజెనిసిటీ) ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. నెల రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని తెలిపారు. దీనికి సంబంధించిన క్లినికల్‌ పరీక్షల ఫలితాలపై భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సంతృప్తి చెందితే చిన్న పిల్లల కోసం రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ టీకాకు అనుమతి వస్తుందని వివరించారు.

ఈ ప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ‘ఎఫ్‌ఇ హెల్త్‌కేర్‌ సమిట్‌’లో డాక్టర్‌ కృష్ణ ఎల్ల మాట్లాడారు. పిల్లలకు ఇచ్చే టీకాలపై రష్యా, అమెరికాలో ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫైజర్‌- బయాన్‌టెక్‌ టీకాను పిల్లలకు ఇవ్వడానికి అమెరికాలో ‘అత్యవసర అనుమతి’ ఇచ్చారు. మన దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికే కొవిడ్‌-19 టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఇచ్చే టీకాలు లేవు. దీనిపై భారత్‌ బయోటెక్‌ నిర్వహిస్తున్న ప్రయోగాలు సఫలం అయితే అదే మన దేశంలో చిన్న పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి టీకా అవుతుంది.

కొవిడ్‌-19, రేబిస్‌లకు ఒకే టీకా!

కొవిడ్‌-19, రేబిస్‌లకు ఒకే టీకా ఇచ్చే అవకాశాలనూ తాము పరిశీలిస్తున్నట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు. అమెరికాలోని థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలడెల్ఫియా ఆవిష్కరించిన టీకాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘డీ-యాక్టివేటెడ్‌ రేబిస్‌ వ్యాక్సిన్‌’ను ఉపయోగించి ఈ టీకాను ఆ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. తదుపరి అధ్యయనాలను నిర్వహించి పూర్తి స్థాయి టీకాగా రూపొందించేందుకు గత ఏడాదే భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రేబిస్‌ వ్యాక్సిన్‌ గట్టి రోగనిరోధక శక్తి ఇస్తున్నట్లు తేలినందున, దీనికి కరోనా వైరస్‌ను సైతం జోడించి ‘కాంబినేషన్‌ టీకా’ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేస్తున్నట్లు కృష్ణ ఎల్ల తెలిపారు.

చుక్కల మందు టీకాతో మెరుగైన ఫలితాలు

‘ఇంజెక్షన్‌తో ఇచ్చే కొవిడ్‌-19 టీకా పొందిన ఒక వ్యక్తికి కొవిడ్‌-19 వచ్చినా వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండదు. కానీ ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించవచ్చు’ అని డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకాతో కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘నాసల్‌ వ్యాక్సిన్‌’పై ప్రస్తుతం ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, 2,3 నెలల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. దీంతోపాటు ఒక డోసు కొవాగ్జిన్‌, మరో డోసు కింద నాసల్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచుతున్నాం

కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్నట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల వెల్లడించారు. ఈ నెలలో 2.8 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేస్తామన్నారు. ఐఐఎల్‌, హాఫ్‌కైన్‌ ఫార్మా, కైరాన్‌ బేరింగ్‌.. తదితర సంస్థల నుంచి టీకాలో ఉపయోగించే ఔషధ పదార్థాల సరఫరా మొదలైనందున, కొవాగ్జిన్‌ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలమని తెలిపారు. డెల్టా ఉత్పరివర్తనంపై కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా పని చేస్తోందని నిర్ధారణ అయిందని, 71 శాతం ప్రభావశీలత (ఎఫికసీ) ఉన్నట్లు వివరించారు. కొవిడ్‌-19 మూడో విడత ముప్పుపై స్పందిస్తూ, టీకా తీసుకున్నా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా వ్యవహరిస్తే మూడో విడత ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు. టీకాతోనే నూరు శాతం రక్షణ సాధ్యం కాదని తెలిపారు.

ఇదీ చూడండి:

e-kyc must: రేషన్ కావాలంటే.. ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.