ETV Bharat / city

Huzurabad By Poll: హుజూరాబాద్​లో పదునెక్కుతున్న వాక్​ బాణాలు - మంత్రి హరీశ్​రావుపై ఈటల కామెంట్లు

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ విషయం తెలంగాణ మాజీ మంత్రి ఈటలను, తెరాసలో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పార్టీ నాయకులను చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఈటలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికార పార్టీ నేతలు.. నేడు పరస్పర విమర్శలు చేసుకోవడం విశేషం. మంత్రులు హరీశ్​ రావు, గంగుల... ఒకప్పుడు ఈటలకు మంచి మిత్రులు. కానీ ఉప ఎన్నిక సందర్భంగా వారి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నదే.

Huzurabad By Poll
Huzurabad By Poll
author img

By

Published : Aug 12, 2021, 11:59 AM IST

తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ప్రకటించిన రోజే మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తల్లిలాంటి పార్టీకి ఈటల ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తండ్రిలాంటి కేసీఆర్‌తో పాటు... నన్ను రారా అంటున్నాడని, తాము మాత్రం రాజేందర్ గారూ అని మాత్రమే సంబోధిస్తామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కేసీఆరేనని అన్నారు. తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని మంత్రి హరీశ్​రావు విమర్శించారు.

ఓటమి భయంతోనే...

ఓటమి భయంతోనే ఈటల అలా మాట్లాడుతున్నాడని... తాను ఓడిపోతున్నానని ఈటల ఒప్పుకున్నారని హరీశ్​ రావు అన్నారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల ఒక్క పని చేయలేదని... నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడ కట్టలేదని దుయ్యబట్టారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు తప్ప ప్రజలుగా మనమంతా ఓడిపోతామన్నారు. మంత్రిగానే ఏమీ పనిచేయలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని హరీశ్​ రావు అన్నారు.

అలా ఎప్పుడూ మాట్లాడలేదు..

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాజకీయ విలువలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన పద్దెనిమిది ఏళ్ల రాజకీయ చరిత్రలో సంస్కారహీనంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరు ఎమ్మెల్యేలపై నిఘా ఉందని... ఎమ్మెల్యేలను కూడా నమ్మకపోతే ఈ రాష్టన్ని పాలించే హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హుజూరాబాద్​లో తెరాస అభ్యర్థి ఎస్సీ, బీసీ కాదు కావాల్సింది... కేసీఆర్​కు కావాల్సింది బానిస అని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: ETELA RAJENDER: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.