ETV Bharat / city

'రోగులకు మెరుగైన సేవలందించేందుకే మా ప్రయత్నం' -బాలకృష్ణ - Telangana news

Balakrishna on bheem: తెలంగాణ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్.. రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ భీమ్‌ పేరుతో.. హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్​మెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. ఈ భీమ్‌ సిస్టంను క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ ప్రారంభించారు.

Balakrishna on bheem
Balakrishna on bheem
author img

By

Published : Apr 2, 2022, 8:43 PM IST

Balakrishna on bheem: రోగులకు నాణ్యమైన సేవలతోపాటు ఆసుపత్రి, వైద్యుల పూర్తి సమాచారం అందించేందుకు తెలంగాణ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. "రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ భీమ్‌" పేరుతో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్​మెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. గీతమ్ డీమ్డ్‌ యూనివర్సిటీ సహకారంతో రూపొందించిన భీమ్‌ సిస్టంను క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ ప్రారంభించారు.

'రోగులకు మెరుగైన సేవలందించేందుకే మా ప్రయత్నం' -బాలకృష్ణ

రోగులకు పారదర్శకతతో కూడిన సేవలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందేలా చూడడంలో ఈ సాఫ్ట్​వేర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ తెలిపారు. రోగులకు సంబంధించిన రికార్డులను వారి ఇంటి వద్ద నుంచే చూసుకునే వీలు కలిపించే విధంగా ఈ సాఫ్ట్​వేర్ రూపొందించినట్లు చెప్పారు. అత్యాధునిక సెక్యూరిటీ, ప్రైవసీ పరిరక్షణకు సంబంధించిన అంశాలను జోడించి రూపొందించడం జరిగిందన్నారు.

ఇది తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ సాఫ్ట్​వేర్​ను ఎప్పటికపుడు అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ చెప్పారు. క్యాన్సర్​తో బాధపడుతున్న రోగులకు అందుబాటైన ధరలలో, ప్రపంచ స్థాయి నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గీతమ్ డీమ్డ్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌, ట్రస్ట్‌ సభ్యులు భరత్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఎన్టీఆర్ భవన్​లో.. వైభవంగా ఉగాది వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.