ETV Bharat / city

Fake Visas: నకిలీ వీసాలతో కువైట్‌ వెళ్లేందుకు 44 మంది మహిళల యత్నం

తెలంగాణలోని శంషాబాద్​ విమానాశ్రయం నుంచి నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు 44 మంది మహిళలు యత్నించారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/07-December-2021/13841521_406_13841521_1638872050076.png

author img

By

Published : Dec 7, 2021, 7:33 PM IST

Fake Visas: నకిలీ వీసాలతో కువైట్‌ వెళ్లేందుకు 44 మంది మహిళల యత్నించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళల వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ మహిళలను విమానాశ్రయ పోలీసులకు ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు.

మధ్యలోనే చించేసి...

Fake Visas: విజిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద చూపించి ఎంప్లాయిమెంట్ వీసా కువైట్​లో చూపిస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. విజిటింగ్ వీసాతో ఫ్లైట్ ఎక్కి మధ్యలోనే దాన్ని చించేస్తున్నారని తెలిపారు. ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంట్ వీరిని దేశం దాటిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏపీలో మరో ఇద్దరు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.

వివిధ రాష్ట్రాల వారు...

Fake Visas: ఆయా ఏజెంట్లపై 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరు నెలల క్రితం ఇదే ఏజెంట్ ముఠా 20మంది మహిళలను దేశం దాటిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కువైట్​లో ఉన్న ట్రావెల్ ఏజెంట్లతో ముంబయి ప్రధాన ఏజెంట్ కుమ్మక్కైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన మహిళలు ఏపీలోని కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మహిళల పాసుపోర్టులు అధికారులు సీజ్ చేశారు.

ఇవీ చూడండి: Hyderabad Gang Rape:హైదరాబాద్​లో బాలికపై గ్యాంగ్ రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.