తెలంగాణలోని జగిత్యాల జిల్లా చెల్గల్లో పొలం వివాదం కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి అతని కొడుకులు దాడి చేశారు.
గంగారెడ్డి తన పొలంలో వరినాట్లు వేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పొలంలో గడ్డి మందు కొట్టారు. దీంతో వరినారు ఎండిపోయింది. ఈ క్రమంలో మల్లేశమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావించి... గంగారెడ్డి కుటుంబసభ్యులు మల్లేశంపై దాడికి దిగారు. గొడవళ్లు, బండరాళ్లతో హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో మల్లేశం తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన మల్లేశాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడే ఉన్న స్థానికులు గొడవను ఆపేందుకు ప్రయత్నించకపోగా... సెల్ఫోన్లలో ఘటనా దృశ్యాలను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: కడప రవాణా శాఖకు భారీ లక్ష్యం కేటాయింపు