ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - horoscope news today

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ASTROLOGICAL PREDICTION
ASTROLOGICAL PREDICTION FOR MAY 17
author img

By

Published : May 17, 2021, 4:17 AM IST

మేషరాశి

అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటక రాశి

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

సింహరాశి

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

కన్యారాశి

చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా ధ్రుడంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.

తులారాశి

ఒక ముఖ్యమైన విషయంలో మంచి పురోగతి ఉంటుంది. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

వృశ్చిక రాశి

మిశ్రమ ఫలితాలున్నాయి. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం మంచిది.

ధనస్సు రాశి

ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. స్వల్ప ధనలాభం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అయినవారితో జాగ్రత్త. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోండి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. దుర్గారాధన శుభప్రదం.

మకరరాశి

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్యలో కాస్త కదలిక వస్తుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కుంభరాశి

అనుకున్నది సాధిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కలహ సూచన ఉంది కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. శనిధ్యాన శ్లోకం చదవండి.

మీనరాశి

మీమీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకుసాగి విజయాన్ని సాధిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.