ArunSagar Awards: సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలకు ప్రముఖ కవి ప్రసాదమూర్తి, ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులు ఎంపికయ్యారు. ప్రసాదమూర్తికి విశిష్ట సాహితీ పురస్కారాన్ని, నాగేశ్వరరావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని జనవరి 2న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అందజేస్తామని అరుణ్‌సాగర్ ట్రస్టు సోమవారం ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, కవి శివారెడ్డి పాల్గొంటున్నట్లు ట్రస్టు వెల్లడించింది.