ETV Bharat / city

జాతీయ మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​కు కేటీఆర్ కౌంటర్

జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

జాతీయ మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​కు కేటీఆర్ కౌంటర్
జాతీయ మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​కు కేటీఆర్ కౌంటర్
author img

By

Published : Dec 3, 2019, 12:00 AM IST

తెలంగాణ సీఎంను తప్పుపడుతూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్ రేఖాశర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు రాత్రి 8గంటల కల్లా ఇంటికి రావాలని కేసీఆర్​ అన్నారని... ఆ మాటలపై రేఖాశర్మ తీవ్రంగా మండిపడ్డారు. క్షేమంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండేందుకు మహిళలు ఏమైనా జీవిత ఖైదీలా? అని ప్రశ్నించారు. ఇంట్లోనే ఉంటే మహిళలపై నేరాలు జరగడం లేదా? అన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ విషయాలను తెలంగాణ సీఎంకు చెప్పాలని ట్వీట్ చేశారు.

వాస్తవాలు తెలుసుకోండి...

ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్పందించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని.. కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా అటువంటి సమాచారాన్ని ఇచ్చాయన్నారు.

are-women-like-a-life-prisoner-at-home
జాతీయ మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​కు కేటీఆర్ కౌంటర్

ఇదీ చూడండి: "దిశ" నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.