సాంకేతికతను వినియోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో ఎపీఎస్ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. ఐటీ ఆధారిత సేవల్లో ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఆర్టీసీ... దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ప్రత్యేకత చాటింది. ఏఎస్ఆర్టీయూ నిర్వహించిన ఐటీ ఇన్ డిజటలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డు పోటీల్లో విజేతగా నిలిచింది. దేశంలో 64 ఆర్టీసీలు ఉండగా.. వీటన్నింటినీ దాటుకుని ఐటీ ఆధారిత సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా మన ఆర్టీసీ దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఐటీ ఆధారంగా ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్, బస్సు రాకపోకల కచ్చిత సమయవేళలను తెలియజేసేందుకు ఎపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ సహా ఇతరత్రా మొబైల్ యాప్లతో సాంకేతిక సేవలు అందిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ప్రయాణికుల మన్ననలు అందుకుంటూ సత్తా చాటింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఏ.కోటేశ్వరరావు అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు 10 లక్షల నగదు బహుమతిని అందుకున్నారు.
ఐటీ సేవల్లో... ఏపీఎస్ఆర్టీసీకి దేశంలో ప్రథమ స్థానం - ఐటీ ఇన్ డిజటలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డు పోటీలు
ఐటీ సేవల్లో ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. దేశంలోని 64 ఆర్టీసీలను దాటుకుని ప్రథమ స్థానం సాధించింది. తద్వారా మన ఆర్టీసీ దేశవ్యాప్త గుర్తింపు సాధించింది

ఇదీ చదవండి