ETV Bharat / city

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.. 17 నుంచి కర్ణాటకకు బస్సులు - అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల వార్తలు

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలుత కర్ణాటక రాష్ట్రానికి బస్సులు నడపాలని నిర్ణయించింది. కరోనా నివారణ చర్యలు తీసుకుంటూ సర్వీసులు నడపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ఇంకా అనుమతి రాలేదన్న అధికారులు.... ఆయా ప్రభుత్వాలు అంగీకారం తెలిపిన వెంటనే బస్సులు నడుపుతామని చెప్పారు.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.. 17 నుంచి కర్ణాటకకు బస్సులు

author img

By

Published : Jun 15, 2020, 2:53 AM IST

రెండున్నర నెలల తర్వాత రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు బస్సులు కదలనున్నాయి. తొలుత కర్ణాటకలోని పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బస్సులు నడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో.... ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17 నుంచి బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రం నుంచి 500 బస్సులు కర్ణాటకకు రాకపోకలు సాగించేవి. కరోనా వ్యాప్తి నివారణ కోసం తొలుత పరిమిత సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం 168 బస్సు సర్వీసులు ప్రారంభించి 4 దశల్లో క్రమంగా పెంచుతూ పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని.... అన్ని జిల్లాల రీజినల్ మేనేజర్లను ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఆదేశించారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని.... బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకే మాత్రమే బుకింగ్ సదుపాయం ఉంటుందని వెల్లడించింది. రిజర్వేషన్‌ చేసుకునేటప్పుడే ప్రయాణికుల ఫోన్‌ నెంబర్‌ సహా పూర్తి చిరునామా వివరాలను నమోదు చేసుకోనున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటూనే..

థర్మల్‌ స్క్రీనింగ్‌, భౌతికదూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడకం తప్పనిసరి చేశారు. సగం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి వచ్చిన వారిలో బస్సులో 5 శాతం మంది ప్రయాణికులకు బస్టాండ్లలోనే కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రొటోకాల్‌ పాటించాలని సూచించారు.

త్వరలోనే తెలంగాణకు

త్వరలోనే తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతోంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆయా రాష్ట్ర సీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఇప్పటి వరకు అక్కడి నుంచి అనుమతి రాలేదు. వారు అంగీకారం తెలిపిన వెంటనే బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి..

ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.