కొవిడ్ జాగ్రత్తల రీత్యా 2020 ఏపీసెట్ను ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షకు.. విద్యార్థుల నుంచి తీసుకున్న 85 రూపాయల ఫీజును తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కరోనా తీవ్రత కారణంగా కంప్యూటర్ ఆధారిత ఏపీ సెట్ పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్ధిపై వ్యయం చేసిన మొత్తాన్ని చెల్లింపులు చేసేందుకు గానూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2020లో సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 1 వరకూ నిర్వహించిన ఈ పరీక్షలను ఐసోలేషన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కోంది. విద్యార్థుల నుంచి తీసుకున్న వ్యయాన్ని చెల్లించేందుకు అనుమతి ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: