ETV Bharat / city

ఏపీఎస్‌డీసీ రూ.19 వేల కోట్ల రుణంపై చర్చోపచర్చలు - APSDC

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) వివిధ రుణ సంస్థల నుంచి ఇంతవరకు రూ.19 వేల కోట్ల రుణం తీసుకుంది. ఇందుకోసం అదనపు ఎక్సైజ్‌ పన్నును ఏపీఎస్‌డీసీకి మళ్లిస్తున్న వైనం దుమారం రేపుతోంది. ఆర్థికశాఖలో ఉన్నతస్థాయిలో పని చేసిన ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు దీన్ని తీవ్రమైన ఆర్థిక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి మాత్రం.. ప్రభుత్వం చట్టప్రకారమే ముందుకెళుతోందన్నారు.

ఏపీఎస్‌డీసీ
ఏపీఎస్‌డీసీ
author img

By

Published : Apr 11, 2021, 7:48 AM IST

ఏపీఎస్‌డీసీ

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఇంతవరకు రూ.21,300 కోట్ల ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును విధించి ఆ మొత్తాన్ని ఎస్‌బీఐ ఎస్క్రో ఖాతాకు మళ్లిస్తోంది. వాటిని ఏపీఎస్‌డీసీకి ఆధారంగా చూపి రూ.వేల కోట్ల రుణాలు పొందుతోంది. ''ఇది ప్రజల నుంచి వసూలు చేసిన రెవెన్యూను తాకట్టు పెట్టడమే. దేశంలో ఇంతకు ముందు ఎప్పుడూ కనీవినీ ఎరుగని వ్యవహారం. ఇది బహిర్గతమైతే కొందరు అధికారులు జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది'' అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన పి.వి.రమేష్‌ అన్నారు. ''ఇది చాలా సీరియస్‌ ఆర్థిక వ్యవహారం. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టి సారించాలి'' అని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ వ్యవహారాల్లోనూ అనుభవమున్న ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు.

ఏమిటీ కంపెనీ, రుణాలు ఎలా..?

ఏపీఎస్‌డీసీ 2020 ఆగస్టు 27న ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ. అదనపు పన్నులు, సెస్‌లు, ఫీజులు, ఛార్జీలను వసూలు చేసి వాటిని ఏపీఎస్‌డీసీ కోసం ఏర్పాటు చేసిన ఎస్క్రో ఖాతాకు బదలాయించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ''కార్పొరేషన్‌ నికర విలువను పెంచేందుకు అవసరమైన ఆస్తులను కూడా అప్పగిస్తాం. ఇంకా ఏదైనా లోటు ఏర్పడితే రుణ సమీకరణకు గ్యారంటీలు కూడా ఇస్తాం. ఏపీఎస్‌డీసీ తన లక్ష్యాలు నెరవేర్చేందుకు రుణాలు సాధించేందుకు, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు'' అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను విధించి, రాష్ట్రంలోని 10 బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిపోల ద్వారా వచ్చే ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ నిధికి పంపిస్తారు. తర్వాత ఏ రోజు వచ్చిన మొత్తాన్ని అదే రోజు ఏపీఎస్‌డీసీ ఎస్క్రో ఖాతాకు చేర్చేలా ఆర్థికశాఖకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రభుత్వాలు గ్రాంటు రూపంలో ఇచ్చే ఆదాయాలను కార్పొరేషన్లు ఖర్చు పెట్టుకోవచ్చు. అంతేతప్ప వాటిని తమ ఆదాయంగా చూపి అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదని ఆర్థికశాఖలోనే కొందరు అధికారులు చెబుతున్నారు.

ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించొచ్చు...

ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు చేర్చి అభివృద్ధి పనులకు, ప్రజల అవసరాలు తీర్చేందుకు ఖర్చు చేయాలి. ఇలా అప్పు కోసం మళ్లించకూడదు. ఒకరకంగా ఇది పన్నుల రాబడిని తాకట్టు పెట్టడమే. ఇది చాలా పెద్ద తప్పు. ఖజానా కోడ్‌, ఫైనాన్సు కోడ్‌, రాజ్యాంగ ఉల్లంఘన కిందకూ వస్తుంది. ఇలాంటి వ్యవహారం దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలోనూ గతంలో జరగలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు.- పి.వి.రమేష్‌, ఆర్థికశాఖ విశ్రాంత ముఖ్య కార్యదర్శి

తీవ్రమైన ఆర్థిక తప్పిదం

ఏపీఎస్‌డీసీ అప్పులు తెచ్చుకునేందుకు అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును సంస్థకు ఎస్క్రో చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా రూ.20 వేల కోట్లు అప్పు చేశారని సమాచారం. ఇది నిజమైతే చాలా తీవ్రమైన ఆర్థిక తప్పిదం.- ఐవైఆర్‌ కృష్ణారావు, విశ్రాంత సీఎస్‌

చట్టప్రకారమే చేస్తున్నాం: ఆర్థిక మంత్రి బుగ్గన

రాష్ట్ర రెవెన్యూను ఎస్క్రో చేయలేదని, ఇందుకోసం అదనపు ఎక్సైజ్‌ పన్ను విధించి, దాన్నే వినియోగించుకుంటున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. ఆ నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామన్నారు. ఎక్సైజ్‌పన్ను పెంచడం ద్వారా.. మద్యం వినియోగం తగ్గించాలనే లక్ష్యం నెరవేర్చే ప్రయత్నమూ చేస్తున్నామని చెప్పారు. ''రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుకు, నిధుల మళ్లింపునకు, వినియోగానికి స్పష్టమైన చట్టం చేశాం. కన్సాలిడేటెడ్‌ నిధికి ఆ రాబడి వస్తుంది. దాని నుంచి అభివృద్ధి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నాం. ఈ కార్పొరేషన్‌ ద్వారా తీసుకునే రుణాలు జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, రైతు భరోసా, నాడు-నేడు కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చట్టపరంగా ఎస్క్రో చేశారు. వాటికి తప్ప వేరే దానికి వినియోగించడం లేదు'' అని మంత్రి స్పష్టం చేశారు.

''భవిష్యత్తు రెవెన్యూలు ఎలా తాకట్టు పెడుతున్నారనడానికి ఇది రెగ్యులర్‌ పన్ను కాదు. సెస్సులు, సర్‌ఛార్జిలు పన్ను పరిధిలోకి రావు'' అని అన్నారు. ఆర్థిక కోడ్‌కు, ఖజానా కోడ్‌కు, బడ్జెట్‌ కోడ్‌కు విరుద్ధమంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ''ఎఫ్‌ఆర్‌బీఎం 3శాతానికి దాటకూడదని చట్టం ఉంది. దానిప్రకారం కేంద్ర ప్రభుత్వం కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల వరకు అధికారికంగా అప్పు చేయొచ్చు. కొవిడ్‌ నేపథ్యంలో రూ.18 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి 3 శాతమే ఉండాలి.. 3.5 శాతం వరకు కూడా అనుమతించారు. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి ఉంటుంది. మనం తీసుకొచ్చే నిధులు దేనికోసం వినియోగిస్తున్నామనేది ముఖ్యం'' అని మంత్రి వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.