అటవీశాఖలో అధికారులు, సిబ్బంది నియామకానికి ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి చర్యలు తీసుకుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నడక, మెడికల్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 10 నుంచి 24 వరకు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో పరీక్షల నిర్వహణ షెడ్యూలు పొందుపరిచామని, సమాచార మెమో, ఫిజికల్ ఫిట్నెస్ ధ్రువపత్రాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో నడక పరీక్ష కోసం రాజమహేంద్రవరం సమీపంలోని స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో రిపోర్టు చేయాలని తెలిపారు. మెడికల్ పరీక్షల కోసం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌కు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. 2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అర్హత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇవీ చదవండి..