ETV Bharat / city

కరోనాపై పోరాటానికి దాతల అండ - ఏపీ సీఎం సహాయనిధి వార్తలు

సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా నివారణ చర్యల కోసం సీఎంఆర్​ఎఫ్​కు దాతలు విరాళాలు అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల వైకాపా నేతలు మూడు కోట్ల 60 లక్షల విరాళాలు అందించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఆ బ్యాంకు ఉద్యోగులు, పీఏసీఎస్, పీడబ్ల్యూసీఎస్.. సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు.

Apcmrf donations
సీఎం సహాయనిధికి కొనసాగుతున్న విరాళాలు
author img

By

Published : Apr 23, 2020, 6:01 AM IST

కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాల తరఫున 2 కోట్ల రూపాయలు విరాళం సీఎంఆర్ఎఫ్​కు ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, కొట్టు విశాల్‌ సీఎం జగన్‌కు చెక్కు అందజేశారు. సీఎం సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజలు, వైకాపా నేతల తరఫున 1 కోటి 60 లక్షల విరాళాన్ని.. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పీవీఎల్‌ నరసింహరాజు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పీడీ ప్రసాదరాజు, ఎస్‌ హరివర్మ సీఎంకు అందించారు. సీఎంఆర్​ఎఫ్​కు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్, పీడబ్ల్యూసీఎస్‌ తరఫున 1 కోటి 25 లక్షల 116 రూపాయలు విరాళం అందించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల తరఫున 5 లక్షల 60 వేల 600 రూపాయలు విరాళం ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావు, మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు చెక్కును సీఎంకు అందించారు.

ఇదీ చదవండి : మూలస్థానం అగ్రహారానికి జాతీయ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.