ETV Bharat / city

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ - కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి లేఖ

కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి లేఖ

author img

By

Published : Jul 8, 2021, 5:00 PM IST

Updated : Jul 9, 2021, 5:01 AM IST

16:50 July 08

కేంద్ర జలశక్తి శాఖకు లేఖ పంపించిన రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి

కృష్ణా నదీ జలాల్ని అక్రమంగా వినియోగించుకునేందుకు... అనుమతుల్లేకుండా, విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న, కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఈ నెల 6న లేఖ రాశారు. తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ప్రతిపాదనల డీపీఆర్‌లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిళ్లకు అందజేయాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులకు మించి... అదనంగా 183 టీఎంసీల జలాల్ని వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 8 ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వాటితో కలిపి 15 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, మరో తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందని తెలిపారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో ప్రస్తావించని, ట్రైబ్యునల్‌ కేటాయింపులు జరపని ప్రాజెక్టులపై ముందుకు వెళ్లకుండా తెలంగాణను నిరోధించాలని కోరారు.

శ్యామలరావు లేఖలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు

బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా 2015 జూన్‌ 18, 19 తేదీల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ అదనంగా 183 టీఎంసీల జలాల్ని వాడుకునేందుకు తెలంగాణ మొదట 8 కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. వీటిని అడ్డుకోవాలని 2020 మే 14న కేఆర్‌ఎంబీకి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. 2020 జూన్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ ఫిర్యాదు చేశాం. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేఆర్‌ఎంబీకి, సీడబ్ల్యూసీకి, అపెక్స్‌ కౌన్సిల్‌కి సమర్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆదేశించారు.

తర్వాత తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి మరో 10 ప్రాజెక్టులు తలపెట్టింది. వాటిపై కేఆర్‌ఎంబీకి... ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఈఎన్‌సీ 2021 ఫిబ్రవరి 18న లేఖ రాశారు. తెలంగాణ అప్పటికీ ఆగకుండా... మరో ఆరు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సమగ్ర అధ్యయనం కోసం జూన్‌ 24న జీవో జారీచేసింది. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకోవడం దాని ఉద్దేశం. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీలు మదింపు జరిపేవరకూ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతిచ్చేవరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా నిరోధించండి.

చిన్నతరహా నీటి ప్రాజెక్టుల్లోనూ అదనంగా వాడేస్తోంది

చిన్నతరహా నీటి ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులకు మించి కూడా తెలంగాణ ప్రభుత్వం వాడేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి... శ్యామలరావు ఫిర్యాదు చేశారు. ‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నతరహా ప్రాజెక్టులకు 116.26 టీఎంసీల జలాలు కేటాయించింది. చెన్నై తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌ 5 టీఎంసీ జలాల్ని కేటాయించింది. అవి పోగా 111.26 టీఎంసీ జలాల్ని వినియోగించుకునేది. రాష్ట్ర విభజన తర్వాత... చెన్నైకి ఇవ్వాల్సిన 5 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాల వాటా పోగా తెలంగాణ 89.15 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ 22.111 టీఎంసీల జలాలు వినియోగించుకోవాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ప్రాజెక్టు కింద... 16,163 చెరువుల నిల్వ సామర్థ్యం పెంచింది. కొత్తగా 24 చెరువులు, 32 కొత్త చెక్‌డ్యాంలు నిర్మించింది. 175 టీఎంసీల జలాల్ని వినియోగించుకుని 10.77 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు చేపట్టింది. తెలంగాణకు కేటాయించిన 89.15 టీఎంసీల జలాల కంటే... వారు వాడుకుంటోంది చాలా ఎక్కువ’ అన్నారు.

ఇదీ చదవండి:

JAGAN CBI CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

Last Updated : Jul 9, 2021, 5:01 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.