ETV Bharat / city

జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం - ap news updates

జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అన్ని బోధనాసుపత్రులలో డయాగ్నస్టిక్‌ సదుపాయాలు కల్పిస్తామని, ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు అందించనున్నట్లు తెలిపారు. కొవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఒక్కరు ఎంతో ఒత్తిడిలో ఉన్నారని, వైద్యులు, నర్సులు, ఆస్పత్రుల సిబ్బంది మొదలు.. గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేస్తుండటం వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలుగుతున్నామన్నారు. దీనివల్లే రాష్ట్రంలో మరణాలు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఎవ్వరూ సహనం కోల్పోవద్దన్న సీఎం.. సంయమనంతో ఉండాలని, మంచితనంతో కింది స్థాయి సిబ్బందితో పని చేయించాలన్నారు.

cm jagan
cm jagan
author img

By

Published : May 19, 2021, 6:38 PM IST

శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ సదుపాయాల కల్పించేందుకు 67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని , విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 11 భోధన ఆసుపత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు ఉన్నాయని సీఎం అన్నారు. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయని, వాటిలో టెక్నాలజీ, నాణ్యత ప్రమాణాలు కూడా లేవన్నారు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆసుపత్రుల్లో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పీపీపీ విధానంలో ఉన్నాయి కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుందని, ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు.

ప్రతీ పార్లమెంట్​ నియోజకవర్గంలో...

కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు ఇప్పటికే ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్‌ ఆస్పత్రితో పాటు, నర్సింగ్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నామమన్నారు. వాటిలో టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ డయాగ్నస్టిక్‌ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నామన్నారు. టీచింగ్‌ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ‘నాడు–నేడులో ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు.

ఎంతో ఒత్తిడితో పని చేస్తున్నారు..

కొవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు. వలంటీర్లు పగలు రాత్రి కష్టపడి, ప్రజలకు సేవలందిస్తున్నారని , వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే అన్నారు. కొవిడ్‌ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. ఫీవర్‌ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని, కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తన దృష్టికి వచ్చిందని, కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు. అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరుతున్నట్లు జేసీలు కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్లలో పని చేస్తున్నారు కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోవాలని, ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదన్నారు. తన దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కొవిడ్‌ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కునే ఒత్తిడిలో ఉన్నారున్నారు. ప్రతి రోజూ 20 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయన్న సీఎం.. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారన్నారు.

మరణాల రేటు చాలా తక్కువ..

రాష్ట్రంలో టయర్‌–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. అందరూ ఆస్పత్రుల్లో బాధ్యతను తీసుకోవడమే కాక, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నామని, ఎవ్వరూ సహనం కోల్పోవద్దన్నారు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: రఘురామ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసుల జారీకి ఆదేశం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.